Sundar Pichai: బుమ్రా కామెంట్ పై సుందర్ పిచాయ్ రియాక్షన్..! 4 d ago
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బంతితో అదరగొడుతున్న టీమ్ ఇండియా పేసర్ జస్పీత్ బుమ్రా, అటు బ్యాట్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. 2022 బర్మింగ్ హామ్ టెస్టులో ఇంగ్లాండ్ పై బుమ్రా ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టడం ప్రపంచ రికార్డు అన్న సంగతి తెలిసిందే. అయితే తన బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే 'గూగుల్‌లో వెతకండి' అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. తాను గూగుల్ చేశానని అన్నారు. ఈ సందర్భంగా భారత బౌలర్ పై ప్రశంసలు కురిపించారు.